పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతితో ఒక సినిమాను చెయ్యనున్నాడన్న విషయం ఎప్పటి నుండో వార్తల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న వార్తల్లో ఒకటి. ఈ విషయంపై ఇప్పటివరకు అభిమానులకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.
ఐతే, తాజాగా మరో రెండ్రోజుల్లో అంటే అక్టోబర్ 17 వ తేదీ నుండి ఒక వారం రోజులపాటు ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ జరగబోతుందని టాక్. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, బాలీవుడ్ విలక్షణ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ లో నటిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.
మరి, ఈ విషయాలలో ఎంతవరకు నిజముందో అధికారికంగా తెలియాల్సి ఉంది. డార్లింగ్ అభిమానుల నుండి ఈ సినిమా పట్ల పూర్తి విముఖత వ్యక్తం అవుతుంది. ఎందుకంటే, పాన్ ఇండియా రేంజ్ ప్రభాస్ చిన్న దర్శకుడు, అదికూడా ఫామ్ లో లేని డైరెక్టర్ తో సినిమా చెయ్యడం డార్లింగ్ ఫ్యాన్స్ కు అస్సలు ఇష్టం లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బాహాటంగానే తెలిపారు ఫ్యాన్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa