ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా : 'దోస్తాన్' పాటకు దోస్త్ తో కలిసి చిందేసిన కీర్తి సురేష్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 06:39 PM

నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న చిత్రం "దసరా". గత కొన్నాళ్ల నుండి సీరియస్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి దసరా కానుకగా ఫస్ట్ సింగిల్ విడుదలైంది.


నాచురల్ స్టార్ నెవెర్ బిఫోర్ మాస్ అవతార్ లో ఊరమాస్ స్టెప్స్ తో విడుదలైన ధూమ్ ధామ్ దోస్తాన్ పాట యూట్యూబులో ఐతే, మిలియన్లకొద్దీ వీక్షణలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ పాటకు హీరోయిన్ కీర్తి సురేష్ తన దోస్త్ తో కలిసి ఊరమాస్ స్టెప్స్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది నిమిషాల్లో ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa