టీజర్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన చిత్రం "ఆకాశం". తమిళ , తెలుగు భాషల్లో నవంబర్ 4వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా నుండి వరసగా లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా 'దారి తప్పి' అనే రొమాంటిక్ మెలోడీ లవ్ సాంగ్ విడుదల అయ్యింది. హీరోహీరోయిన్లు మంచు ప్రదేశాలలో తిరుగుతూ జీవితసత్యాన్ని గుర్తించే పాట ఇది. ఈ పాటను గోపిసుందర్ స్వరపరచగా, సాయి చరణ్ ఆలపించారు. సామ్రాట్ సాహిత్యం అందించారు.
ఇందులో తమిళ నటుడు అశోక్ సెల్వన్ హీరో కాగా, రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వయోకాం 18 స్టూడియోస్ తో కలిసి శ్రీనిధి సాగర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ దర్శకత్వం చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |