ఎప్పుడైతే రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ బాహుబలి సినిమాలో నటించాడో ఇక అప్పటి నుండి లోకల్ సినిమాలలో కనిపించడమే మానేశాడు.. కేవలం పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ టాలీవుడ్ దర్శకుడు మారుతీ డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్నారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఐతే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కి సంబంధించిన టెస్ట్ షూట్ నిన్ననే జరిగిందట. ఇందులో ఏదో ఒకదానిని ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చెయ్యనున్నారట. అలానే రేపటి నుండే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుందని వినికిడి. మరి ఈ విషయాలలో ఏమాత్రం నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.