మరోసారి సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'యశోద' అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ఇది. హరిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను నవంబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.