ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఇప్పటివరకు ఏ సినిమాలోనూ నటించలేదు కానీ, వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన 'ఎవడు' సినిమాలో బన్నీ పాత్రకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పడగా ఆ పాత్రను సినిమా మొత్తం చరణ్ క్యారీ చేసారు. ఐతే ఎక్కడా వీరిద్దరూ కలిసినట్టు మాత్రం ఉండదు.
తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ప్రఖ్యాత టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు చెప్పారు. ఈ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' అనే టాక్ షోలో అల్లు అరవింద్ గారు తన డ్రీం ప్రాజెక్ట్ గురించి షేర్ చేసుకున్నారు. ఈ మేరకు చరణ్ -అర్జున్లతో తనకొక మల్టీస్టారర్ తీయాలనుందని, ఇందుకోసం 'చరణ్ - అర్జున్' అనే టైటిల్ ను తాను ప్రతి సంవత్సరం రెన్యూ చేయిస్తున్నానని చెప్పారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కానీ, తప్పకుండా ఐతే జరిగి తీరుతుందని, తనకు నమ్మకముందని అల్లు అరవింద్ గారు తెలిపారు.
ఒకసారి ఊహించుకోండి.... తెరపైన మెగాపవర్ స్టార్ ఒకవైపు.... ఐకాన్ స్టార్ మరోవైపు.... ఇద్దరివీ అమేజింగ్ డాన్స్ స్టెప్స్... అద్భుతమైన నటన ... ఒకటే మాస్ క్రేజ్... ఎవరిని చూడాలో అర్ధంకాక తికమకలో ఉండే ఆడియన్స్ విజిల్స్, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి.