కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవలే "పొన్నియిన్ సెల్వన్" సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
తాజాగా విక్రమ్ పా రంజిత్ డైరెక్షన్లో ఒక సినిమాను చెయ్యబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ మేరకు ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమం కూడా జరిగింది.
లేటెస్ట్ గా పా రంజిత్ విక్రమ్ తో చేస్తున్న సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ఈ సినిమాలో విక్రమ్ కు జోడిగా హీరోయిన్ మాళవిక మోహనన్ నటిస్తుందని తెలుస్తుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాకు GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa