రాజశేఖర్ కూతురు శివాని కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుందనే వార్త రాగానే ఆయన అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సాహంతో శివాని 'టూ స్టేట్స్' అనే సినిమా చేస్తోంది. సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమాకి వెంకట్ కుంచం దర్శకత్వం వహిస్తున్నాడు. అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరి దశకి చేరుకుంది.
ఈ సినిమా చివరి షెడ్యూల్ యూఎస్ లో ప్లాన్ చేశారు. జనవరి నుంచి ఈ షెడ్యూల్ మొదలవుతుంది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అడివి శేష్ కి గల క్రేజ్ గురించి తెలిసిందే. ఇక రాజశేఖర్ కూతురు శివాని విషయానికి వస్తే, ఆమె తొలిచిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa