చంద్రమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘100% కాదల్’. తెలుగు ‘100% లవ్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో జీవీ ప్రకాశ్..షాలినిపాండే హీరో..హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తెలుగు దర్శకుడు సుకుమార్, భునచంద్రమౌళి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. సెన్సార్ ప్రదర్శనకు తీసుకెళ్లారు. సినిమాను చూసిన అధికారులు ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రేమికుల రోజు కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం గురించి చెబుతూ… ఇదో రొమాంటిక్ హాస్య చిత్రం. యువతకు బాగా నచ్చుతుంది. జీవీ ప్రకాశ్‌కు మరో గుర్తింపునిచ్చే చిత్రం. పాటలు కూడా అద్భుతంగా వచ్చాయని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa