ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య టాక్ షోలో... రీసెంట్ బ్లాక్ బస్టర్ యంగ్ హీరోస్..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 08:29 PM

ఇరు తెలుగు రాష్ట్రాలలో అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. భారీ అంచనాల నడుమ గత శుక్రవారం నుండి అందుబాటులోకొచ్చిన ఈ టాక్ షో డిజిటల్ రంగంలో భారీ మెరుపులు మెరిపిస్తుంది.


మొదటి ఎపిసోడ్ కాస్త పొలిటికల్, కాస్త ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో కలగలసి ఉండగా, సెకండ్ ఎపిసోడ్ పూర్తి తరహా ఫన్ ఫిల్డ్ ఎలిమెంట్స్ తో నిండిపోయిందని ప్రోమోను బట్టి అర్ధం అవుతుంది. ఈ శుక్రవారం సెకండ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుండగా, ఈ లోపే మూడవ ఎపిసోడ్ లో ఎవరు పార్టిసిపేట్ చెయ్యబోతున్నారనే విషయంపై క్రేజీ బజ్ ఒకటి వినిపిస్తుంది.


ఇంతకూ ఈ టాక్ షో మూడవ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చెయ్యబోయేదెవరంటే, ఒకేఒకే జీవితం సినిమాతో గ్రాండ్ కం బ్యాక్ సక్సెస్ అందుకున్న శర్వానంద్ మరియు మేజర్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అడవి శేష్. ఈ ఇద్దరు యంగ్ హీరోలు కలిసి, బాలయ్య టాక్ షోలో పాల్గొని, ప్రేక్షకులను ఎంటర్టైనర్ చెయ్యబోతున్నారని టాక్. చూద్దాం ఈ విషయంలో ఎంతవరకు నిజముందో...!!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com