నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "జెర్సీ" 2019లో విడుదలై, ఆ ఏడాది బెస్ట్ ఫీచర్ ఫిలిం గా నేషనల్ అవార్డును కొట్టేసింది. 'మళ్ళీ రావా' అనే సినిమాతో 2017లో డైరెక్టర్ గా పరిచయమైన గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన రెండవ సినిమా ఇది. రెండో సినిమాతోనే నేషనల్ అవార్డు రేంజుకు చేరిన గౌతమ్ తిన్ననూరి ట్యాలెంట్ ఆయనకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ ను తీసుకొచ్చింది.
ఐతే, గౌతమ్ హిందీలో తీసిన జెర్సీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగలడంతో, చెర్రీ తో చెయ్యబోయే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదనుకోండి.
ఈ విషయం పక్కన పెడితే, గౌతమ్ తన నెక్స్ట్ మూవీని రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్నట్టు లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్. గౌతమ్ చెప్పిన ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ విజయ్ కు తెగ నచ్చేసిందట. దీంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ కు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని వినికిడి. వచ్చే ఏడాది నుండి సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.