తెలుగు నటి లయ గోర్టీ "ప్రేమించు" వంటి తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ పెళ్లి తర్వాత కాలిఫోర్నియాలో స్థిరపడింది. తాజాగా లయ గోర్టీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో కొత్త డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో లయ ప్రముఖ గాయని మంగ్లీ (సత్యవతి రాథోడ్)తో కలిసి ఒక ఫోక్ సాంగ్ కి డాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో కి తన ఫాన్స్ ఫిదా అవుతూ వీక్షణలు అండ్ కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు. లయ చివరిగా 2018లో విడుదలైన రవితేజ "అమర్ అక్బర్ ఆంటోని" చిత్రంలో కనిపించింది.