తెలుగు చిత్రసీమ అగ్రనటులలో ఒకరైన ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ని కొన్ని రోజుల క్రితం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రభాస్ హైకోర్ట్‌లో పిటిషిన్ దాఖలు చేశారు. ప్రభాస్ పిటిషిన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలనీ రెవెన్యూ అధికారులను ఆదేశించి. ఈ నేపథ్యంలో ఈరోజు రెవెన్యూ అధికారులు కౌంటర్ పిటిషిన్ దాఖలు చేసారు.ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, అందులో గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారని, అందువల్లే తాము దాన్ని సీజ్ చేయాల్సి వచ్చిందని రెవెన్యూ అధికారులు పిటిషన్‌లో పేర్కొన్నారు. శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గం సమీపంలో, సర్వే నంబర్ 5/3లో ప్రభాస్‌కు చెందిన 2,083 చదరపు అడుగుల స్థలాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని చెబుతూ, అందుకు గల కారణాలను తమ పిటిషన్‌లో వెల్లడించారు. దీంతో ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, కేసు విచారణను 31వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa