భారత క్రికెటర్ ఎంఎస్ ధోని కోలీవుడ్‌లో ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో తన తొలి నిర్మాణాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. డైరెక్టర్ రమేష్ తమిళమణి ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించనున్నట్టు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇతర భారతీయ భాషల్లోకి డబ్ కానున్న ఈ చిత్రం అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుంది అని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |