మెహర్ రమేష్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మూవీలో చిరంజీవి శంకర్ అనే క్యారెక్టర్‌ని పోషిస్తున్నారు అని లేటెస్ట్ టాక్. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. రావు రమేష్, మురళీ శర్మ, తులసి, వెన్నెల కిషోర్, కీర్తి సురేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఇటీవలి జరిగిన ఇంటర్వ్యూలో దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ, ఈ చిత్రం 40% చిత్రీకరణను పూర్తయిందని మరియు ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని మార్చి 2023 విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ మూవీ వేదాళం యొక్క అధికారిక తెలుగు రీమేక్. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.