ఏబీసీడీ తదుపరి అల్లు శిరీష్ నటిస్తున్న కొత్త చిత్రం "ఊర్వశివో రాక్షసివో". అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి డైరెక్టర్.
2018లో విడుదలై, కమర్షియల్ సక్సెస్ సాధించిన కోలీవుడ్ మూవీ "ప్యార్ ప్రేమ కాదల్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 4న విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు అక్టోబర్ 30న హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. విశేషమేంటంటే, ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు రాబోతున్నారు.
అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, విజయ్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్నారు.
![]() |
![]() |