దీపావళి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ ఎనౌన్స్మెంట్ టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబులో కోటి వ్యూస్ సాధించి, నెంబర్ వన్ ట్రెండింగ్ పొజిషన్లో దూసుకుపోతుంది. మెగాస్టార్ ఊరమాస్ అవతార్, మాస్సీ స్వాగ్, స్టైలిష్ ఎలివేషన్స్ సూపర్ గా ఉండడంతో ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి థంపింగ్ రెస్పాన్స్ వస్తుంది.
బాబీ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. శృతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావడానికి రెడీ అవుతుంది.
![]() |
![]() |