ఈ రోజు సాయంత్రమే యశోద ట్రైలర్ విడుదల కాబోతుంది. పాన్ ఇండియా భాషల్లో నవంబర్ 11న విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ సెలెబ్రిటీ రిలీజ్ చెయ్యనున్నారు. కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళ్ లో సూర్య, హిందీలో వరుణ్ ధావన్ యశోద ట్రైలర్ ను లాంచ్ చెయ్యనున్నారని తెలిపిన మేకర్స్ తాజాగా యశోద తెలుగు ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చెయ్యబోతున్నారని ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 05:36నిమిషాలకు అన్ని భాషల్లో యశోద ట్రైలర్ విడుదల కాబోతుంది.
సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో 'ఖుషీ' అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా.
యశోద మూవీని హరి శంకర్, హరీష్ నారాయణ్ డైరెక్ట్ చేసారు. మణిశర్మ సంగీతం అందించారు.
![]() |
![]() |