ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాథల్' సెట్స్‌లో జాయిన్ అయ్యిన జ్యోతిక

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 04:56 PM

కోలీవుడ్ నటి, స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక 13 ఏళ్ల తర్వాత మలయాళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల, ఆమె పుట్టినరోజు సందర్భంగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టితో ఆమె కొత్త చిత్రాన్ని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి 'కథల్: ది కోర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, జ్యోతిక నిన్న సెట్స్‌లోకి జాయిన్ అయింది. ఈ షెడ్యూల్‌లో  లీడ్ పెయిర్ మధ్య ఉన్న కొన్ని కీలక సన్నివేశాలను మూవీ మేకర్స్ చిత్రీకరించనున్నారు.


ఆదర్శ్ సుకుమారన్, పాల్సన్ స్కారియా రాసిన ఈ చిత్రానికి ది గ్రేట్ ఇండియన్ కిచెన్ దర్శకుడు జో బేబీ దర్శకత్వం వహిస్తున్నారు. మమ్ముట్టి కంపానీ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి మాథ్యూస్ పులికాన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa