కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన సినిమా 'కాంతారా'. ఈ సినిమాలో కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే తాజాగా ఈ సినిమా కేజీఎఫ్-1 సినిమా రికార్డు బద్దలుకోటింది. 2022లో అన్ని భాషల్లో కలిపి అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ సినిమాల జాబితాలో కాంతారా సినిమా ఏడో స్థానంలో ఉంది. ఈ సినిమాకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించింది.