సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార లతో కలిసి రీసెంట్గానే లండన్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు అప్డేట్స్ ఇస్తూ వచ్చింది.
తాజాగా ఈ రోజు కొంచెంసేపటి క్రితమే మహేష్ అండ్ ఫ్యామిలీ లండన్ వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ కి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు మహేష్ ఎయిర్పోర్ట్ పిక్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
వెకేషన్ ముగిసింది కనుక, ఇప్పుడు మహేష్ వర్క్ మోడ్ లోకి మారిపోనున్నారు. మరి కొన్ని రోజుల్లోనే త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ నటిస్తున్న మూడో సినిమా కి సంబంధించిన న్యూ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.