సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా, మేర్లపాక గాంధీ డైరెక్షన్లో రూపొందిన ట్రావెల్ కామెడీ ఎంటర్టైనర్ "లైక్ షేర్ సబ్స్క్రైబ్". బ్రహ్మాజీ, నెల్లూరు సుదర్శన్, మైమ్ గోపి, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా నవంబర్ 4న అంటే రేపే ఇరు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ టీం మొత్తానికి బెస్ట్ విషెస్ తెలియచేస్తూ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టారు. ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది కూడా ప్రభాసే.
ప్రభాస్ కు 'వర్షం' రూపంలో బిగ్ కమర్షియల్ హిట్ నిచ్చిన దర్శకుడు శోభన్ కొడుకే సంతోష్ శోభన్.
![]() |
![]() |