పూనమ్ బజ్వా 2005లో తన మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. చాలా సినిమాల్లో నటించినా ఈ భామకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో ఒకప్పుడు హోమ్లీ అందాలతో అలరించిన భామ పూనమ్ బజ్వా... ప్రస్తుతం కన్నడ సినిమాల్లో అడపదడపా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ ఎప్పటికప్పుడు తన పిక్స్‌ను పంచకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.