ప్రేమ్ భగీరద్ దర్శకత్వంలో భారతం క్రియేషన్స్ పతాకంపై మాగాపు సూర్యకమల్-వై.రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన స్ఫూర్తిదాయక చిత్రం అజయ్ పాసయ్యాడు. అజయ్ అమన్, సాయికేతన్, అంబిక హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి, యాంకర్ ఝాన్సీ, శివన్నారాయణ ముఖ్యపాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో విడుద లకానుంది.
చిత్ర దర్శకుడు ప్రేమ్ భగీరద్‌మాట్లాడుతూ.. సకుటుంబ సమేతంగా చూడదగిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అజయ్ పాసయ్యాడు. ఓ యువకుడు తనకెదురైన సమస్యను తనదైన శైలిలో ఎలా పరిష్కరించుకున్నాడు. ఎలా ముందుకు సాగాడు అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. నవ్విస్తూ, కవ్విస్తూనే ఆలోచింపజేసే కథ-కథనాలతో అజయ్ పాసయ్యాడు సినిమా సాగుతుంది. అన్నారు.
ఈ చిత్రానికి రచనః బి.కె.ఈశ్వర్, సంగీతంః సాహిణి శ్రీనివాస్, పాటుః ప్రతాప్-బి.కె.ఈశ్వర్, ఫోటోగ్రఫిః జె.గణేశన్, ఎడిటింగ్‌ః పి.వి.నరసింహారావు, నిర్మాతుః మాగాపు సూర్యకమల్-వై.రాజేంద్ర, దర్శకత్వంః ప్రేమ్ భగీరద్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa