తన పెళ్లికి సంబంధించిన వార్తలపై హీరో విశాల్ స్పందించారు. విశాల్ చిత్రం 'లాఠీ' టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అభినయతో వివాహంపై వస్తున్న వార్తలకు ఆయన స్పందిస్తూ ప్రతి దానికి ఓ సమయం వస్తుందని, అది రాగానే చేసుకుంటానని అన్నాడు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ బిల్డింగ్ పూర్తయిన వెంటనే తన పెళ్లి జరుగుతుందని స్పష్టత ఇచ్చాడు. అందరికీ చెప్పే వివాహం చేసుకుంటానని, తప్పకుండా అందరూ రావాలని కోరాడు.