మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, సీనియర్ హీరో కృష్ణ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కాగా, ఈ ఏడాది మహేశ్ బాబు ఇంట వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఆయన సోదరుడు రమేశ్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ జనవరి 8న మృతిచెందారు. ఆ బాధనుండి కోలుకోకముందే సెప్టెంబర్ 28న మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించారు. తల్లి దూరమైన బాధ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో ఆయన తండ్రి కూడా మరణించారు.