ప్రముఖ నటుడు జగపతిబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆయన బాబాకు దీపారాధన చేస్తున్న వీడియో అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోతో పాటు "దేవుడా అందరూ నా దగ్గర ఉందనుకుంటున్న డబ్బు నాకు ఇచ్చేయ్.. చెప్పలేక చస్తున్నా" అనే కాప్షన్ జతచేశారు. దీంతో ఈ ట్వీట్ ఆయన వ్యంగ్యంగా చేసినట్లు అర్థం అవుతోంది. ఒకప్పుడు హీరోగా వెలుగొందిన జగపతిబాబు, ప్రస్తుతం ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.