సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. కృష్ణ 1942 మే 31 న గుంటూరు జిల్లా తెనాలి మండలంలో బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు. అతనిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా కుదించాడు. చిన్నతనం నుంచి అతనికి ఎన్.టి.రామారావు అభిమాన నటుడు. పాతాళ భైరవి అభిమాన చిత్రం కృష్ణకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు.