తెలుగు డైరెక్టర్ కేవీ అనుదీప్ తో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ చేసిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "ప్రిన్స్". దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.
లేటెస్ట్ గా ప్రిన్స్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్ గా ఫిక్స్ అయ్యింది. ఈనెల 25నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రిన్స్ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుంది.
ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.