కాంతారా :
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేసిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ విలేజ్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం నవంబర్ 24, 2022 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని అధికారిక సమాచారం.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.
ప్రిన్స్ :
అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన 'ప్రిన్స్' మూవీ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయింది. కామెడీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా జోడిగా కనిపించనుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం నవంబర్ 25, 2022 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని డిస్నీ హాట్‌స్టార్ అధికారకంగా ప్రకటించింది.
సత్యరాజ్, ప్రేమి, సూరి, ఆనందరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబుతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు