ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయ‌న‌కు పెళ్లయితే నన్నెందుకు అడుగుతారు.. వరలక్ష్మి ఫైర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 02, 2019, 08:16 PM

పందెం కోడి విశాల్ రెడ్డి పెళ్లి ముచ్చట అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలుగు కుర్రాడైన విశాల్.. తెలుగు అమ్మాయిని పెళ్లాడబోతున్నాడని వార్తలు రావడం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కూతురు అనీషా అనే యువతిని అతడు చేసుకోబోతున్నాడట. ఈ విషయాన్ని విశాల్ తండ్రి జీకే రెడ్డి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. పనిలో పనిగా ఆ వార్తలకు తమిళతార వరలక్ష్మీ శరత్ కుమార్ పేరును కూడా జోడిస్తున్నారు. గతంలో విశాల్, వరలక్ష్మి ప్రేమించుకుని, తర్వాత విడిపోయారని చెబుతున్నారు.
విశాల్ పెళ్లి చేసుకుంటున్నాడని, ఇక వరలక్ష్మి కూడా గతాన్ని నెమరేసుకోవడం మానేసి ఓ తోడు వెతుక్కుని సినిమాలకు గుడ్‌బై చెబుతుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీంతో వరలక్ష్మికి పిచ్చి కోపం వచ్చింది. ఎవడో పెళ్లి చేసుకుంటే తన ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘నేను పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదు. ఇలాంటి చెత్త నాకు కొత్తకాదు. ఈ ఏడాది చివరిలోనూ పనీపాటా లేని వాళ్లు నాకు పెళ్లంటూ వాగడం మొదలెట్టారు.. నేనెక్కడికీ వెళ్లను, ఇక్కడే ఉంటాను. సినిమాల్లో నటిస్తూనే అందరి సంగతీ తేలుస్తాను.. మైడియర్ ప్రచారకులారా మీకు బెటర్‌ లక్‌ నెక్ట్స్‌టైమ్‌…’ ఎద్దేవా చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa