మాస్ రాజా రవితేజ కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తో కలిసి నిర్మిస్తున్న చిత్రం "మట్టి కుస్తీ". ఇందులో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. చెల్లా అయ్యావు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
తెలుగు, తమిళ భాషలలో డిసెంబర్ 2వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో మట్టి కుస్తీ చిత్రబృందం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ఈవెంట్ కు హీరో విష్ణు విశాల్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, డైరెక్టర్ చెల్లా అయ్యావు తదితరులు హాజరు కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa