సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటించిన పుష్ప దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. పుష్ప-2 చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలోనే ఓ అదిరిపోయే న్యూస్ వచ్చింది. పుష్ప సినిమాను రష్యాలోనూ విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1 నంచి రష్యాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిరోజే పుష్పను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకలో బన్నీ, సుక్కు, రష్మిక పాల్గొంటారు. డిసెంబర్ 8న పుష్పను రష్యాలోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. రేపే పుష్ప రష్యన్ ట్రైలర్ రిలీజ్ కానుంది.