విశ్వనటుడు కమల్ హాసన్ - మూవీ మావెరిక్ శంకర్ షణ్ముగం కలయికలో ఆల్ టైం పొలిటికల్ క్లాసిక్ "ఇండియన్" సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ మూవీ షూటింగ్ కు కొన్ని అవాంతరాలు ఎదురై, సినిమా ఆగిపోయినప్పటికీ, రీసెంట్గానే తిరిగి పునఃప్రారంభించబడింది.
ఐతే, శంకర్ మరోపక్క మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో "RC 15" షూటింగ్ ను కూడా చేస్తున్నారు. దీంతో శంకర్ షెడ్యూల్ నిమిత్తం ఇండియన్ 2, RC 15 సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం RC 15 షూటింగ్ కోసం న్యూజిలాండ్ లో ఉన్న శంకర్ వచ్చే నెల ఐదవ తేదీన చెన్నైలో తిరిగి ఇండియన్ 2 మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారట.
ఇండియన్ 2 లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియభావని శంకర్ తదితరులు నటిస్తుండగా, అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.