కోలీవుడ్ హీరో అశోక్ శెల్వన్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం "ఆకాశం". తమిళంలో "నితం ఒరు వానం" టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకుడు. రీసెంట్గా తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి డీసెంట్ రివ్యూస్ వచ్చాయి. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. రీతూ వర్మ, శివాత్మిక రాజశేఖర్, అపర్ణా బాలమురళి హీరోయిన్లుగా నటించారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ డిసెంబర్ 2వ తేదీ నుండి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ భాషలలో డిజిటల్ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa