ఈ ఏడాది "మేజర్" సినిమాతో గ్రాండ్ పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్నారు హీరో అడివిశేష్. ఆయన నుండి ఇదే ఏడాదిలో రాబోతున్న సరి కొత్త చిత్రం "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, హిట్ 2 మూవీ ఇరు తెలుగు రాష్ట్రాలలో పదికోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకుందని వినికిడి. ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతున్న హిట్ 2 మూవీ, ఆడియన్స్ లో క్రేజ్ కారణంగా తొలి వీకెండ్ కే టార్గెట్ రీచ్ అవుతుందని టాక్ నడుస్తుంది. అడివిశేష్ కెరీర్ లోనే రికార్డు బ్రేకింగ్ ఓవర్సీస్ రిలీజ్ ను పొందుతున్నారు. ఓవర్సీస్ లో మొత్తంగా 450కు పైగా లొకేషన్స్ లో హిట్ 2 మూవీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa