స్టార్ హీరోయిన్ రష్మికను కన్నడ పరిశ్రమ బ్యాన్ చేయనుందంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగశేఖర్ స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు. దాని గురించి నాకు తెలియదు. ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. దీనిని నేను సపోర్ట్ చేయను అని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కిర్రిక్ పార్టీ తో తనకు మొదట ఛాన్స్ ఇచ్చిన రక్షిత్ శెట్టి నిర్మాత సంస్థ పరంవా పేరు చెప్పడానికి రష్మిక ఆసక్తి చూపలేదు. దీంతో కన్నడనాట ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.