నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. హరియాణాకు చెందిన ఓ సారంగి వాయిద్యకారుడికి వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. మమన్ ఖాన్(83) అనే సారంగి వాయిద్యకారుడి ఆరోగ్యం బాగాలేదని, సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఇంద్రజిత్ బర్కే అనే వ్యక్తి ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టుకి స్పందించిన సోనూసూద్ తాను సాయం చేస్తానని హామీ ఇచ్చారు. హిసార్ జిల్లా ఖరక్‌పుర్ గ్రామానికి చెందిన మమన్ ఖాన్ రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేకపోవడంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు.