టాలీవుడ్ హీరో ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఓ రియాలిటీ షోలో చేసిన కామెంట్స్ తో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. కాగా, రియాలిటీ షోలో తాను చేసిన వ్యాఖ్యల వీడియోపై వరుణ్ ధావన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియోను సదరు ఛానల్ కేవలం వినోదం కోసమే ఎడిట్ చేసినట్లు తెలిపాడు. ఈ వీడియోను తాము కూడా ఫన్నీగా తీసుకున్నామని, దీనిపై ఎవరూ మరీ ఎక్కువగా ఆలోచించవద్దని తెలిపాడు. కాగా, ప్రేమ వార్తలపై కృతి సనన్ కూడా స్పందించింది. అవి కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేసింది.