ఈ మధ్య చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో బాక్సీఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబడుతున్నాయి. ఈ జాబితాలో వస్తున్న మరో చిత్రమే 'ముఖచిత్రం'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'అందరూ అనుకుంటున్న కథ ఇది .. అసలు జరిగింది ఇది' అంటూ ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. వికాస్ వశిష్ఠ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో, ప్రియ వడ్లమాని హీరోయిన్ గా నటించింది. విష్వక్ సేన్, చైతన్య రావు, రవిశంకర్ ముఖ్యపాత్రలు పోషించారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాను ఈ నెల 9న విడుదల చేయనున్నారు.