యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా నటిస్తున్న చిత్రం "టాప్ గేర్". శశికాంత్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజాగా టాప్ గేర్ టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు డిసెంబర్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు టాప్ గేర్ టీజర్ రిలీజ్ కానుంది. విశేషమేంటంటే, డైరెక్టర్ మారుతీ టాప్ గేర్ టీజర్ ను విడుదల చెయ్యనున్నారు.
ఇప్పటివరకు విడుదలైన టాప్ గేర్ లిరికల్ సాంగ్స్ కు ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది.