మూడు వారాల క్రితం తమిళంలో విడుదలైన రంజితమే సాంగ్ 75 + మిలియన్ వ్యూస్, 2+ మిలియన్ లైక్స్ తో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ గా నిన్నే తెలుగులో విడుదలైంది ఈ పాట. 24 గంటల్లో 1. 5 మిలియన్ వ్యూస్ ను, 110కే లైక్స్ ను రాబట్టి యూట్యూబ్ టాప్ #4 ట్రెండింగ్ పొజిషన్ లో దూసుకుపోతుంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ పాట ఒక ఊపు ఊపేస్తోంది. థమన్ పెప్పీ ట్యూన్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, అనురాగ్, మానసిల గాత్రం వెరసి... రంజితమే సాంగ్ ను చార్ట్ బస్టర్ గా నిలిచేలా చేసాయి.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శరత్ కుమార్, ప్రభు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.