పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం "కీడా కోలా". తరుణ్ భాస్కర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డైరెక్ట్ చేస్తున్న మూడవ సినిమా ఇది.
రీసెంట్గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై, శరవేగంగా జరుగుతుంది. తాజాగా తరుణ్ భాస్కర్ కీడా కోలా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. నటీనటుల నటనను కెమెరా స్క్రీన్ పై సుదీర్ఘంగా పరిశీలిస్తున్న తన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి, త్వరలోనే మీరు చూడబోయే దానినే ఇప్పుడు నేను చూస్తున్నాను... నిజంగా ఇది చాలా బాగా వచ్చింది.. అని కామెంట్ చేసారు.
VG సైన్మా మొట్టమొదటి ప్రొడక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.