అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’. డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. అయితే ఒక ట్వీట్ పుణ్యమాని సోషల్ మీడియాలో ‘హిట్ 2’ మేజర్ సస్పెన్స్ గురించి ఒక లీక్ బయటకి వచ్చింది. “హీరోయిన్ మీనాక్షీ చౌదరీనే సైకో కిల్లర్. ఇదే హిట్ 2లో సస్పెన్స్ ఎలిమెంట్” అంటూ ఒకరు ట్వీట్ చేసి షాక్ ఇస్తే, ట్రైలర్ లో చూపించిన పల్లగాట్లని చూడండి, అవి అచ్చం హీరోయిన్ మీనాక్షీ చౌదరి పల్ల లాగానే ఉంటాయి, ఆమే సైకో కిల్లర్ అంటూ ఇంకొకరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ చూసిన హీరో అడవి శేష్, “నిజం బ్రో, నమ్మండి” అంటూ ఎటకరంగా రిప్లై ఇచ్చాడు. మరి ఇది నిజమో కాదో సినిమా చూస్తే కానీ తెలీదు.