సినీ నటి పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందట. ప్రస్తుతం ఆమె కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటోందని పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మానసిక సమస్యలు, కండరాల నొప్పితో పాటు పలు సమస్యలు ఎదురవుతాయట. గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతోందని సమాచారం. పూనమ్ కౌర్ మాయాజాలం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది.