బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అందాల తార దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ "పఠాన్". ఇందులో జాన్ అబ్రహం కీరోల్ లో నటిస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. విశాల్ - శేఖర్ సంగీతం అందిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా గత నెలలో పఠాన్ టీజర్ విడుదల కాగా, ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ఈ టీజర్ యూట్యూబులో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.
వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదలైంది. ఇంకా ఈ సినిమా థియేటర్లకు రావడానికి 55రోజుల సమయం ఉందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చెయ్యడం జరిగింది.