ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం "గుర్తుందా శీతాకాలం". ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల మూడుసార్లు వాయిదా పడి, ఎట్టకేలకు డిసెంబర్ 9న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలో సత్యదేవ్ అండ్ టీం ముమ్మర ప్రచార కార్యక్రమాలను చేపట్టి, సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, రేపు ఉదయం పదకొండింటికి గుర్తుందా శీతాకాలం రిలీజ్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
నాగశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సుహాసిని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.