క్రేజీ హీరోయిన్ సమంత "యశోద" సినిమాతో పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 11న పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజైన యశోద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అద్భుతమైన థియేటర్ రన్ ను ఇంకా కొనసాగిస్తున్న యశోద మూవీకి సంబంధించి తాజా బజ్ ఒకటి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈవా హాస్పిటల్స్ ఇష్యూ సాల్వ్ అవ్వడంతో యశోద డిజిటల్ ఎంట్రీ అతి త్వరలోనే జరగబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు డిసెంబర్ 9 నుండి ప్రైమ్ వీడియో లో యశోద మూవీ స్ట్రీమింగ్ కి రాబోతుందని లేటెస్ట్ టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రాబోతుందట.
హరి శంకర్, హరీష్ నారాయణ్ ల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు కీరోల్స్ ప్లే చేసారు.