అడివిశేష్ నుండి వచ్చిన సరికొత్త చిత్రం "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షోతోనే సూపర్ హిట్ తెచ్చుకుని, హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలో రన్ అవుతుంది.
ఒక్క ఇండియాలోనే కాక ఓవర్సీస్ లో కూడా హిట్ 2 సాలిడ్ ఫస్ట్ డే కలెక్షన్లను రాబట్టేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పటికే USA లో 300కే డాలర్స్ ను రాబట్టేసింది మరి. ఇందులో 230కే+ డాలర్స్ ప్రీమియర్స్ ద్వారా వచ్చినవే. ఇక పూర్తి లెక్కలపై క్లారిటీ రావాలంటే, రేపటి వరకు ఆగాల్సిందే.