పల్లవి:
ఏమని అనాలనీ.. తోచని క్షణాలివి
యే మలుపో.. ఎదురయ్యే.. పయనిమిదా
ఆమని నువ్వేననీ.. నీ జత చేరాలనీ..
యే తలపో.. మొదలయ్యే.. మౌనమిదా
ఏవో గురుతులు.. నన్నడిగే ప్రశ్నలకి..
నువ్వేబదులని రాగలనా.. నీ దరికీ
విడిగా తడిగా విరబూసే కలకీ..
చెలియా.. నీ కాంతినందించవా
అవుననవా.. అవుననవా.. అవుననవా.. మనసును సంభాళించవా
అవుననవా.. అవుననవా.. అవుననవా.. మరల.. ప్రేమగ సమీపించవా
చరణం :
తెలిసే లోపే.. నువు తెలిసే లోపే..
చెలీ.. చేజారిందే.. ప్రపంచం
కలిసేలోపే.. మనం కలిసేలోపే..
ఇలా.. ఎడబాటై.. రగిలినదే.. కాలం
కన్నెదుటే.. వజ్రాన్నీ.. కనుగొంటూ ఉన్నా..
వెతికానే.. ఓ తీరాలనీ
నిజమేదో.. తెలిసాకా.. ఇపుడంటూ ఉన్నా..
ఎన్నటికీ.. నువు కావాలనీ
అవుననవా.. అవుననవా.. అవుననవా.. మనసును సంభాళించవా
అవుననవా.. అవుననవా.. అవుననవా.. మరల.. ప్రేమగ సమీపించవా
అవుననవా.. అవుననవా.. అవుననవా..
అవుననవా.. అవుననవా.. అవుననవా.. మనసును సంభాళించవా
అవుననవా.. అవుననవా.. అవుననవా.. మరల.. ప్రేమగ సమీపించవా